లెఫ్టినెంట్ గవర్నర్గా తెలుగు మహిళ ప్రమాణస్వీకారం
అమెరికాలోని మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్గా భారత సంతతి మహిళ అరుణా
మిల్లర్ ప్రమాణస్వీకారం చేశారు. నవంబర్లో జరిగిన అమెరికా మధ్యంతర ఎన్నికల్లో
లెఫ్టినెంట్ గవర్నర్గా ఆమె విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా
పెదపారుపూడికి చెందిన ఆమె కుటుంబం చాలా ఏళ్ల క్రితం అమెరికా వలస వెళ్లింది.