అంతర్జాతీయ వేదికలపై ఆర్ఆర్ఆర్ మూవీ పేరు మారుమ్రోగుతోంది. ఇప్పటికే
గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకుని చరిత్ర సృష్టించిన ఈ చిత్రం రీసెంట్గా
లాస్ ఎంజిల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అనే మరో అవార్డును గెలుచుకుంది.
ఇలా ప్రపంచ స్థాయిలో రికార్డులు క్రియేట్ చేస్తున్న ఈ మూవీపై హాలీవుడ్
దిగ్గజం, అవతార్ మూవీ డైరెక్టర్ జెమ్స్ కామెరూన్ ప్రశంసలు కురిపించారు.
ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్‌కు నామినేట్ అయిన నేపథ్యంలో డైరెక్టర్
రాజమౌళి, ఎమ్ఎమ్ కీరవాణిలు అమెరికాలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ
నేపథ్యంలో అమెరికాలో జరిగినో ఓ అవార్డు ఫంక్షన్లో రాజమౌళి, జెమ్స్ కామెరూన్
కలిశారు. ఈ సందర్భంగా కామెరూన్ ఆర్ఆర్ఆర్ మూవీ రెండు సార్లు చూశానని తనతో
చెప్పారంటూ రాజమౌళి మురిసిపోయారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. ‘ది గ్రేట్
డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ ఆర్ఆర్ఆర్ మూవీ చూశారు. ఆయనకు సినిమా చాలా
బాగా నచ్చింది.

అంతేకాదు ఆర్ఆర్ఆర్ మూవీ చూడమని తన భార్య సుజిక్ జేమ్స్‌కి కూడా ఆయన
ప్రతిపాదించారు. దీంతో ఆమెతో కలిసి ఆయన ఆర్ఆర్ఆర్ మూవీని మరోసారి చూశారట. ఈ
సందర్భంగా ఆయన ఆర్ఆర్ఆర్ సినిమా గురించి పది నిమిషాల పాటు
నాతో విశ్లేషించడం నమ్మలేకపోతున్నా. అదే విధంగా ‘మీరు ప్రపంచంలోనే
టాప్ డైరెక్టర్’ అని ఆయన నాకు కితాబు ఇవ్వడం చాలా ఆనందగా ఉంది. మీకు
ధన్యవాదాలు సార్’ అంటూ జక్కన్న ట్వీట్లో రాసుకొచ్చారు.