క్యాన్సర్ అనగానే చాలా మంది భయపడుతుంటారు. అందులోనూ గర్భాశయ క్యాన్సర్ అనగానే
మహిళలు వణికిపోతుంటారు. అయితే ఈ గర్భాశయ క్యాన్సర్ ను ఎలా గుర్తించాలి? ఏఏ
లక్షణాలు ఉంటే గర్భాశయ క్యాన్సర్ అనే ప్రాథమిక అవగాహనకు రావచ్చు. ఇది ప్రపంచ
వ్యాప్తంగా మహిళల్లో నాల్గవ అత్యంత సాధారణ క్యాన్సర్. భారతదేశంలో ముఖ్యంగా
గ్రామీణ భారతదేశంలో ఇది రెండవ అత్యంత సాధారణ క్యాన్సర్. ప్రతి సంవత్సరం సుమారు
1,24,000 మంది మహిళలు ఈ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. వారిలో సగం మంది ఒక
సంవత్సరం లోపు మరణిస్తున్నారు. ఈ క్యాన్సర్ తో ప్రతి 8 నిమిషాలకు ఒక మహిళ
మరణిస్తుంది. హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (HPV) రకాలు 16 మరియు 18తో నిరంతర
జననేంద్రియ సంక్రమణం ప్రధాన కారకాలుగా మారుతాయని కిమ్స్ సవీరా కన్సల్టెంట్,
ప్రసూతి వైద్యులు, గైనకాలజిస్ట్ డాక్టర్ పి శిల్పా చౌదరి వెల్లడించారు.
ముందస్తు వివాహం, ముందస్తు ప్రసవం, బహుముఖ ప్రసవం, స్త్రీ
పురుషులిద్దరిలో బహుళ లైంగిక భాగస్వాములు, ధూమపానం, మద్యపానం ఈ క్యాన్సర్‌కు
దారితీసే కొన్ని అంశాలు. ఇది ప్రధానంగా 40, 50 సంవత్సరాల మధ్య వయస్సు గల
స్త్రీలను ప్రభావితం చేస్తుంది. గర్భాశయ క్యాన్సర్ క్రింది లక్షణాలను
కలిగిస్తుంది:
1. సాధారణ రుతుక్రమం కాకుండా ఇతర యోని రక్తస్రావం
2. లైంగిక సంపర్కం తర్వాత యోని రక్తస్రావం
3. పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత యోని రక్తస్రావం (మెనోపాజ్)
4. దుర్వాసన, రక్తంతో తడిసిన యోని ఉత్సర్గ
5. మూత్రం, మల విసర్జనలో ఆటంకాలు
సర్వైకల్ క్యాన్సర్ అనేది నివారించదగిన క్యాన్సర్. 2020లో, ప్రపంచ ఆరోగ్య
సంస్థ (WHO) ఈ క్యాన్సర్ నిర్మూలన కోసం ప్రపంచ కార్యాచరణ ప్రణాళికను
అందించింది. దీని కింద 2030 నాటికి…
1. 90% కౌమార బాలికలకు 15 సంవత్సరాల వయస్సులోపు HPV వైరస్‌కు వ్యతిరేకంగా
టీకాలు వేయాలి
2. 70% మంది మహిళలు 35, 45 సంవత్సరాల మధ్య అధిక ఖచ్చితత్వ పరీక్షతో
స్క్రీనింగ్ కలిగి ఉండాలి
3. గర్భాశయ పూర్వ క్యాన్సర్ లేదా క్యాన్సర్‌తో బాధపడుతున్న 90% మంది మహిళలు
తగిన చికిత్స పొందాలి.
ప్రజలకు అవగాహన కల్పించేందుకు, జనవరిని “సర్వికల్ క్యాన్సర్ అవేర్నెస్ నెల”గా
హైలైట్ చేశారు.
ఈ సంవత్సరం థీమ్ “కొన్ని తరాల్లో గర్భాశయ క్యాన్సర్ అంతం”.
1. సమాచారం పొందండి: ఈ క్యాన్సర్‌ను నివారించడం, ముందస్తుగా గుర్తించడం
గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం
2. స్క్రీనింగ్ పొందండి: 30 సంవత్సరాల వయస్సు నుంచి లైంగికంగా చురుకుగా ఉన్న
మహిళలందరూ 5 నుంచి 10 సంవత్సరాలకు ఒకసారి HPV సంక్రమణ కోసం పరీక్షించబడాలి.
3. టీకాలు వేయండి: 9 నుంచి 26 సంవత్సరాల వయస్సు గల బాలికలందరికీ HPV టీకాలు
వేయాలని సూచించాలి.