గువాహటి : ముంబయి ఓపెనర్ పృథ్వీ షా (240 బ్యాటింగ్; 283 బంతుల్లో 33×4, 1×6)
చెలరేగాడు. అజేయ డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో
అత్యుత్తమ వ్యక్తిగత స్కోరుతో పృధ్వీ సత్తాచాటడంతో అస్సాంతో రంజీ ట్రోఫీ
ఎలైట్ గ్రూపు-బి మ్యాచ్‌లో ముంబయి భారీస్కోరు దిశగా దూసుకెళ్తోంది. తొలి రోజు
ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది. ఉదయం టాస్
గెలిచిన అస్సాం ఫీల్డింగ్ ఎంచుకోగా ఆ జట్టుకు చుక్కలు చూపిస్తూ పృథ్వీ ఆకాశమే
హద్దుగా చెలరేగాడు. ముషీర్‌ఖాన్ (42)తో కలిసి తొలి వికెట్‌కు 123 పరుగులు
జోడించిన అతడు అర్మాన్ జాఫర్ (27)తో కలిసి రెండో వికెట్‌కు 74 పరుగులు
జతచేశాడు. ఆరుగురు బౌలర్లు మారినా పృథ్వీని కట్టడి చేయలేకపోయారు. కెప్టెన్
ఆజింక్య రహానె (73 బ్యాటింగ్; 140 బంతుల్లో 5×4)తో కలిసి పృథ్వీ జోరు
కొనసాగించాడు. అభేద్యమైన మూడో వికెట్‌కు వీరిద్దరు 200 పరుగులు జోడించారు.