గువాహటిలో శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా భారీ ( 373 )
స్కోర్ చేసింది. స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ శతకంతో చెలరేగాడు. తొలి బంతి
నుంచి టాప్‌గేర్‌లో ఆడిన కోహ్లీ లంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 80
బంతుల్లోనే 11 ఫోర్లు 1 సిక్సర్‌తో సెంచరీకి చేరువయ్యాడు. వన్డేల్లో
కోహ్లీకి ఇది 45వ శతకం. అంతర్జాతీయ క్రికెట్లో 73వ సెంచరీ. శ్రేయాస్
అయ్యర్, రాహుల్‌తో కలిసి అంతను స్కోర్ బోర్డును 300 దాటించాడు. కోహ్లీ,
రాహుల్ జోరు చూస్తే టీమిండియా 400 స్కోర్ చేసేలా కనిపించింది. అయితే.. రజిత
బౌలింగ్‌లో రాహుల్ బౌల్డ్ అయ్యాడు. హార్దిక్ పాండ్యా 14, అక్షర్ పటేల్ 9
రన్స్ చేసి అవుట్ అయ్యారు. చివర్లో దూకుడుగా ఆడే క్రమంలో కోహ్లీ (113) ఏడో
వికెట్‌గా వెనుదిరిగాడు. రజిత బౌలింగ్‌లో కీపర్ మెండిస్ క్యాచ్ అదుకోవడంతో
అతని ఇన్నింగ్స్‌కు తెరపడింది. అంతకుముందు ఓపెనర్లు రోహిత్ శర్మ,
శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీలు సాధించారు. దాంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో
373 పరుగులు చేసింది.
రోహిత్, గిల్ హాఫ్ సెంచరీ…
టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్ (83), శుభ్‌మన్
గిల్ (70) శుభారంభం ఇచ్చారు. వీళ్లిద్దరూ తొలి వికెట్‌కు 143 పరుగులు
జోడించారు. దసున్ షనక బౌలింగ్‌లో గిల్ ఎల్బీగా అవుట్ అయ్యాడు. కొంచెం
సేపటికే హిట్‌మ్యాన్ మధుషనక బౌలింగ్‌లో బౌల్డ్ కావడంతో రెండో వికెట్
కోల్పోయింది. 28 రన్స్ చేసిన అయ్యర్ మూడో వికెట్‌గా వెనుదిరిగాడు.
ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్నకేఎల్ రాహుల్ (39) టచ్‌లో ఉన్నట్టే
కనిపించాడు. కానీ, రజిత బంతిని సరిగా అంచనా వేయలేక వికెట్
సమర్పించుకున్నాడు. లంక బౌలర్లలో కసున్ రజిత మూడు వికెట్లు తీశాడు.
మధుషనక, ధనుంజయ, షనక, కరుణరత్నే తలా ఒక వికెట్ పడగొట్టారు.