న్యూఢిల్లీ :భూమిలో పోషకాల నిర్వహణకు డిజిటల్ రూపంలో రైతులకు అందిస్తున్న
సేవలకు గుర్తింపుగా తెలంగాణకు జాతీయ స్థాయి పురస్కారం దక్కింది.
స్టార్టప్స్‌తో కలిసి భూమిలో పోషకవిలువల సంరక్షణ కోసం ఎప్పటికప్పుడు సలహాలు,
సూచనలు అందిస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వం ‘డిజిటల్ ఇండియా అవార్డ్-2022’
ప్రదానం చేసింది. ఇక్కడి విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ
ఎమర్జింగ్ టెక్నాలజీస్ డైరెక్టర్ రమాదేవి, ఇతర అధికారులు రాష్ట్రపతి
ద్రౌపదీముర్ము చేతులమీదుగా ‘‘స్మార్ట్ న్యూట్రియెంట్ మేనేజ్మెంట్ ఆఫ్
సాయిల్’’ అవార్డు స్వీకరించారు. రైతులకు 30 నిమిషాల్లో భూసారపరీక్ష ఫలితాలు
అందివ్వడంతో పాటు, ఎరువులు, సూక్ష్మపోషకాల వాడకంపై సలహాలు ఇవ్వడం, భూసార
క్షీణత, నీటి కాలుష్య నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి రైతులకు తగిన
మార్గదర్శనం చేస్తున్నందుకు ‘డిజిటల్ ఇనిషియేటివ్ ఇన్ కొలాబరేషన్ విత్
స్టార్టప్స్’ విభాగంలో ఈ పురస్కారం దక్కింది.