బెంగళూరు : ఆరోగ్యం, వైద్య పరీక్షలు, ఆర్థిక ప్రగతి, సామాజిక విధానాలు, మానసిక
ఆరోగ్యం, రాజ్యాంగంతో ప్రజాస్వామ్య విధానాల పరిరక్షణ వంటి విభిన్న రంగాలను
ప్రభావితం చేసిన ఆరుగురు శాస్త్రవేత్తలకు పురస్కారాలను ఇన్ఫోసిస్ సైన్స్
ఫౌండేషన్ (ఐఎస్ఎఫ్) అందజేసింది. శనివారం బెంగళూరులో నిర్వహించిన
కార్యక్రమంలో సుమన్ చక్రవర్తి (ఇంజినీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్),
సుధీర్ కృష్ణస్వామి (హ్యుమానిటీస్), విధిత వైద్య (లైఫ్ సైన్స్), మహేశ్
కాక్కడే (మ్యాథమేటికల్ సైన్సెస్), నిస్సిమ్ కనేకర్ (ఫిజికల్ సైన్స్),
రోహిణి పాండే (సోషల్ సైన్స్) ఈ పురస్కారాలను అందుకున్నారు. విజేతలకు లక్ష
అమెరికన్ డాలర్ల నగదు బహుమతి, పురస్కారాన్ని అందజేశారు.