న్యూఢిల్లీ : కరోనా ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ఎక్స్‌బీబీ.1.5 కేసులు
పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఈ వేరియంట్ ఇప్పటికే 25
దేశాలకుపైగా విస్తరించిందని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితిని తాము
నిశితంగా పరిశీలిస్తున్నామని, దీని ముప్పు గురించి తెలుసుకొని పూర్తి వివరాలు
వెల్లడిస్తామని చెప్పింది. ఎక్స్‌బీబీ.1.5 వేరియంట్ ప్రపంచానికి కొత్త
ముప్పుగా పరిణమించింది. అత్యంత ప్రమాదకరమైన ఈ వేరియంట్ శరవేగంగా
విస్తరిస్తోంది. అమెరికాలో గత ఏడాది డిసెంబర్లో ఈ వేరియంట్ వల్లే అత్యధిక
కేసులు వెలుగుచూశాయి. ఇప్పుడు ప్రపంచంలోని ఇతర దేశాల్లోనూ ఈ కేసులు
నమోదవుతున్నాయి.

భారత్ బేఫికర్ : మరోవైపు భారత్‌లో మాత్రం కరోనా వేరియంట్ల ప్రభావం కన్పించండం
లేదు. గత 24 గంటల్లో కొత్తగా 214 కేసులు మాత్రమే నమోదయ్యాయి. కరోనా పాజిటివిటీ
రేటు 0.01గా ఉంది. ప్రస్తుతం 2,509 యాక్టివ్ కేసులున్నాయి. రికవరీ రేటు
98.8శాతంగా ఉంది.