వాషింగ్టన్ : రష్యా దండయాత్రతో సతమతమవుతున్న ఉక్రెయిన్‌కు అమెరికా మరోసారి
భారీ సాయం ప్రకటించింది. ఉక్రెయిన్‌కు 375 కోట్ల డాలర్ల మిలటరీ సాయాన్ని
అందిస్తామని అమెరికా విదేశాంగ మంత్రి టోని బ్లింకెన్ వెల్లడించారు. అమెరికా
రక్షణ శాఖ నుంచి వెను వెంటనే 285 కోట్ల డాలర్ల మిలటరీ సాయం అందుతుందని
చెప్పారు. విదేశాంగ శాఖ నుంచి అందే 22.5 కోట్ల డాలర్లు ఉక్రెయిన్ మిలటరీ
ఆధునీకరణకు, దీర్ఘకాలంలో ఆ దేశం సాయుధ సంపత్తి పెంచుకోవడానికి
కేటాయిస్తున్నామని చెప్పారు. ఈ సారి అందించే సాయంతో ఇప్పటివరకు అమెరికా
ఉక్రెయిన్ చేసిన సాయం 2 వేల కోట్లకు పైగా డాలర్లకు చేరుకుంది. అమెరికా ఈ
స్థాయిలో ఏ దేశానికి ఇప్పటివరకు సాయం అందించలేదు. ఉక్రెయిన్‌కు తొలిసారిగా 50
ఎం2–ఏ2 బ్రాడ్లీ సాయుధ వాహనాలను అందిస్తోంది. ఈ సాయుధ వాహనాల్లో పదాతిదళ
బెటాలియన్‌కు పూర్తి స్థాయి రక్షణ కవచాలు , యాంటీ ట్యాంకు క్షిపణులు, 2,50,000
రౌండ్ల 25ఎంఎం మారణాయుధాలు ఉంటాయని పెంటగాన్ వెల్లడించింది. అంతేకాకుండా
100ఎం–113 సాయుధ సిబ్బందిని తీసుకువెళ్లే వాహనాలు, 50 మైన్–రెసిస్టెంట్స్,
మెరుపుదాడుల్ని ఎదుర్కొనే వాహనాలు కూడా ఉంటాయని వివరించింది.