ఆస్ట్రేలియా దిగ్గజ మహిళా క్రికెటర్ బెలిండా క్లార్క్ కు అరుదైన గౌరవం
లభించింది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ ప్రవేశద్వారం వద్ద గురువారం ఆమె
విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వాక్ ఆఫ్ హానర్లో భాగంగా బెలిండా విగ్రహం
ఏర్పాటు చేయడంతో సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. కాగా, సిడ్నీ
స్టేడియంలో ఆస్ట్రేలియా మహిళా జట్టు కెప్టెన్గా పనిచేసిన మొదటి మహిళా
క్రికెటర్ గా బెలిండా గుర్తింపు పొందింది. న్యూ సౌత్ వేల్స్ ప్రీమియర్
క్వాంటిన్ మహిళా క్రికెటర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇప్పటివరకు
ప్రాంగణంలోని 73 పురుష క్రికెటర్ల విగ్రహాలు ఏర్పాటు కాగా, ఇప్పుడు ఆ క్లబ్
లో బెలిండా క్లార్క్ చేరింది. బెలిండా డబుల్ సెంచరీ చేసిన ఏకైక క్రికెటర్.
రెండుసార్లు ప్రపంచకప్ అందుకున్నారు.