న్యూఢిల్లీ : జీ-20 సమావేశాల సందర్భంగా నిర్వహించే ప్రతి కార్యక్రమంలోనూ
భారతీయత ప్రతిబింబించాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డి
అన్నారు. జీ-20 సమావేశాల సమయంలో నిర్వహించాల్సిన సాంస్కృతిక కార్యక్రమాలపై తన
పరిధిలోని పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల అధికారులతో
ఆయన సమీక్ష నిర్వహించారు. సమావేశాలు జరిగే ప్రాంతాల్లో చేపట్టనున్న వివిధ
కార్యక్రమాలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి
వివరించారు. కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని
అధికారులకు కేంద్రమంత్రి సూచించారు. సమీక్షలో జీ-20 షెర్పా (కార్యక్రమ సన్నాహక
కర్త) అమితాబ్ కాంత్, ఈశాన్య రాష్ట్రాల వ్యవహారాల శాఖ కార్యదర్శి లోక్
రంజన్ తదితరులు పాల్గొన్నారు.