న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ స్థానిక సర్
గంగారాం ఆసుపత్రిలో చేరారు. కుమార్తె ప్రియాంకాగాంధీ వాద్రా ఆమె వెంట ఉన్నారు.
సోనియా వైరల్ శ్వాసకోశ ఇన్ఫెక్షనుతో బాధపడుతున్నట్లు ఆసుపత్రి వర్గాలు
తెలిపాయి. మంగళవారం నుంచే ఆమె అస్వస్థతతో ఉన్నారు. ఈ కారణంగానే
ఉత్తర్‌ప్రదేశ్ భారత్ జోడో యాత్రలో ఏడు కిలోమీటర్లు నడిచాక రాహుల్‌గాంధీ,
ప్రియాంకాగాంధీ మంగళవారం సాయంత్రానికి దిల్లీకి తిరిగి వచ్చారు. బాగ్‌పత్‌లోని
మావికలాలో రాత్రి బసచేసిన భారత్ జోడో యాత్ర బుధవారం ఉదయం ఆరు గంటలకు తిరిగి
కొనసాగింది. ఈ యాత్రలో రాహుల్ ఒక్కరే కనిపించారు. ప్రియాంకాగాంధీ తర్వాత
వచ్చి కలుస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.