వాషింగ్టన్ : భారతదేశంలో అమెరికా రాయబారిగా లాస్ ఏంజెలెస్ మాజీ మేయర్
ఎరిక్ గార్సెటి మళ్లీ నామినేట్ అయ్యారు. ఈ మేరకు బైడెన్ సర్కారు నిర్ణయం
తీసుకుంది. ఈ మారు ఆయన నియామకానికి సెనేట్ ఆమోదం లభిస్తుందని అధ్యక్ష భవనం
వైట్‌హౌస్ విశ్వాసం వ్యక్తంచేసింది. ఎరిక్.. అధ్యక్షుడు బైడెన్‌కు అత్యంత
దగ్గరి వ్యక్తి. తన సిబ్బందిలో ఒకరి పట్ల గార్సెటి అనుచితంగా ప్రవర్తించాడన్న
ఆరోపణలతో ఆయన నియామకానికి రిపబ్లికన్ సెనేటర్ చంక్ గ్రాస్లీ గతంలో అభ్యంతరం
చెప్పారు. దీంతో 2021 జులైలో గార్సెటి నియామకం ఆగిపోయింది. భారత్‌తో
సత్సంబంధాలు చాలా కీలకమైనందున మళ్లీ నామినేట్ చేస్తున్నట్లు
వైట్‌హౌస్ పేర్కొంది.