బ్యాంకాక్ : మిలిటరీ జుంటా పరిపాలనలో ఉన్న మయన్మార్‌లోని ఓ కోర్టు ఆ దేశ
అగ్రనేత ఆంగ్‌సాన్ సూకీ (77)కి మరో ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం
తీర్పు ఇచ్చింది. మిలిటరీ జుంటా పరిపాలనలో ఉన్న మయన్మార్‌లోని ఓ కోర్టు ఆ దేశ
అగ్రనేత ఆంగ్‌సాన్ సూకీ కి మరో ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.
ఆమె ప్రభుత్వం అధికారంలో ఉండగా హెలికాప్టర్ కొనుగోలుకు ఓ కేబినెట్ సభ్యుడికి
అనుమతి ఇవ్వడం ద్వారా దేశ ఖజానాకు నష్టం కలిగించారనేది ఈ కేసులో ఒక అభియోగం.
ఆమెపై సైన్యం బనాయించిన పలు కేసులలో ఇదే చివరిది. ఈ ఏడేళ్ల జైలు శిక్షతో కలిపి
సూకీ మొత్తం 33 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంది. అక్రమంగా దిగుమతి
చేసుకున్న వాకీటాకీలను కలిగిఉండటం, ఉపయోగించడం, కొవిడ్ నిబంధనల ఉల్లంఘన,
ప్రభుత్వ రహస్యాలను బయటపెట్టడం, ఎన్నికల్లో మోసానికి పాల్పడటం, దేశద్రోహం
తదితర అభియోగాలతో నమోదైన కేసుల్లో గతంలోనే ఆమెకు 26 ఏళ్ల జైలు శిక్ష ఖరారైన
సంగతి గమనార్హం. ప్రస్తుతం సూకీ మయన్మార్ రాజధాని నెపిడా శివార్లలోని ఓ
జైలులో ఉన్న ప్రత్యేక భవనంలో ఖైదీగా ఉన్నారు. 2021 ఫిబ్రవరిలో సూకీ
ప్రభుత్వాన్ని కూల్చివేసిన అనంతరం మయన్మార్‌లో సైన్యం పాలన చేపట్టింది.