బీజింగ్ : చైనాలో కరోనా విలయతాండవం చేస్తోంది. దాంతో ఆ దేశం నుంచి వచ్చే
ప్రయాణికులకు వైరస్ నిర్ధారణ పరీక్షలు, ఆర్టీ-పీసీఆర్ నెగెటివ్
ధ్రువపత్రాలు తప్పనిసరి చేస్తూ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు నిర్ణయం
తీసుకుంటున్నాయి. చైనాలో కరోనా విలయతాండవం చేస్తోంది. దాంతో ఆ దేశం నుంచి
వచ్చే ప్రయాణికులకు వైరస్ నిర్ధారణ పరీక్షలు, ఆర్టీ-పీసీఆర్ నెగెటివ్
ధ్రువపత్రాలు తప్పనిసరి చేస్తూ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు నిర్ణయం
తీసుకుంటున్నాయి. మరోవైపు, ఈ నిబంధనలను చైనా తప్పుపట్టింది. ఇవన్నీ
వివక్షాపూరితమైన ఆంక్షలని అసహనం వ్యక్తం చేసింది. ‘‘కొవిడ్ కట్టడికి మూడు
సంవత్సరాలుగా చైనా చేసిన ప్రయత్నాలను విధ్వంసం చేయడం, దేశ వ్యవస్థపై దాడి
చేయడమే ఈ నిబంధనల ఉద్దేశం. ఈ ఆంక్షలు ఆధారం లేనివి, వివక్షాపూరితమైనవని చైనా
ప్రభుత్వ మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ ఓ కథనంలో మండిపడింది. కాగా, కరోనా
కేసుల సునామీతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నప్పటికీ జీరో కొవిడ్ విధానం నుంచి
చైనా క్రమంగా దూరంగా జరుగుతోంది. విదేశాల నుంచి చైనాకు వచ్చే ప్రయాణికులకు
వచ్చే నెల 8వ తేదీ నుంచి క్వారంటైన్ నిబంధనను ఎత్తివేస్తున్నట్లు చైనా
ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోపక్క అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు
సడలించడంతో చైనీయులు విదేశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఐఏటీఏ అసంతృప్తి
భారత్కు వస్తున్న అంతర్జాతీయ ప్రయాణికులకు మళ్లీ కరోనా పరీక్షలను తప్పనిసరి
చేయడంపై ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) అసంతృప్తి
వ్యక్తం చేసింది. ‘‘మూడు సంవత్సరాల క్రితం కరోనా ప్రారంభమైన నాటితో పోల్చితే
ప్రస్తుత పరిస్థితులు భిన్నమైనవి. ఈ సమయంలో తిరిగి పరీక్షలు ప్రవేశపెట్టడం
నిరాశపరిచింది. అడుగు వెనక్కి వెళుతున్నట్లుందని ఐఏటీఏ వ్యాఖ్యానించింది.