కోల్‌కతా: దేశంలో నీటి అడుగున తొలి మెట్రో రైలు సొరంగ నిర్మాణం
పశ్చిమబెంగాల్లో సిద్ధమవుతోంది. కోల్‌కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్
కింద రూ.120 కోట్ల వ్యయంతో ఈ సొరంగ రైలుమార్గాన్ని హుగ్లీ నది దిగువన
నిర్మిస్తున్నారు. 520 మీటర్ల పొడవు ఉన్న ఈ సొరంగాన్ని 45 సెకన్లలో దాటే
మెట్రో రైలు ప్రయాణికులకు వింత అనుభూతిని అందించనుంది. సొరంగ అంతర్గత
అడ్డుకొలత 5.55 మీటర్లు కాగా, బాహ్య అడ్డుకొలత 6.1 మీటర్లు. లండన్-ప్యారిస్
కారిడార్‌లోని యూరోస్టార్ సర్వీసు మాదిరిగా రూపుదిద్దుకొంటున్న ఈ సొరంగమార్గం
నదీగర్భానికి 13 మీటర్ల దిగువన, భూమట్టానికి 33 మీటర్ల దిగువన ఉంటుంది. వచ్చే
ఏడాది డిసెంబరుకల్లా దీన్ని ప్రారంభిస్తారు. ‘ఈస్ట్ వెస్ట్ కారిడార్‌కు ఈ
సొరంగ నిర్మాణం చాలా కీలకం. చుట్టూ ఉన్న నివాసప్రాంతాలు, కొన్ని సాంకేతిక
సమస్యల దృష్ట్యా ఈ నిర్మాణం మాకున్న ఏకైక ప్రత్యామ్నాయం’ అని కోల్‌కతా
మెట్రోరైల్ కార్పొరేషన్ జీఎం (సివిల్) శైలేష్‌కుమార్ తెలిపారు.
హావ్‌డా-సీల్దా నడుమ రోడ్డు ప్రయాణానికి ప్రస్తుతం గంటన్నర సమయం పడుతోందని, ఈ
మెట్రో మార్గం ఏర్పాటుతో అది 40 నిమిషాలకు తగ్గుతుందన్నారు. ఈ రెండు
స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ కూడా తగ్గుతుందని తెలిపారు.