కాఠ్మాండూ : సీపీఎన్-మావోయిస్టు సెంటర్(ఎంసీ) పార్టీ ఛైర్మన్ పుష్పకమల్
దహాల్ ప్రచండ మూడోసారి నేపాల్ ప్రధాని పీఠాన్ని అధిష్ఠించారు. గెరిల్లా
ఉద్యమ నేతగా పేరొందిన ఆయనతో.. దేశాధ్యక్షురాలు బిద్యాదేవి భండారీ ప్రమాణం
చేయించారు. ప్రచండతో పాటు కొత్త సంకీర్ణ ప్రభుత్వంలోని కొందరు మంత్రులు కూడా
ప్రమాణం చేశారు. నూతన మంత్రివర్గంలో ముగ్గురు ఉప ప్రధానులు బిష్ణు పౌడల్
(సీపీఎన్-యూఎంఎల్), నారాయణ్ కాజీ శ్రేష్ఠ (సీపీఎన్-ఎంసీ), రబి లామిచానే
(ఆర్ఎస్పీ) ఉన్నారు. ప్రధాని పదవి విషయంలో నేపాలీ కాంగ్రెస్తో విభేదించిన
ప్రచండ సీపీఎన్-యూఎంఎల్ ఛైర్మన్, మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి మద్దతుతో ఆ
పీఠాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే