ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. రిలయన్స్ జియో
ట్రూ 5జీ పేరిట ఈ సేవలను జియో సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. తొలుత
విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుమల కొండపై 5జీ సేవలను అందుబాటులోకి
తీసుకొచ్చామని, ఏడాదిలోగా రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు కూడా 5జీ సేవలను
అందుబాటులోకి తీసుకురానున్నామని జియో ప్రకటించింది. విజయవాడలో సోమవారం జరిగిన
ఓ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, డీజీపీ
కె.వి.రాజేంద్రనాథ్‌రెడ్డి సమక్షంలో పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి గుడివాడ
అమర్నాథ్ ఈ సేవలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ అన్ని రంగాల్లో నూతన సాంకేతిక
పరిజ్ఞానం వినియోగం తప్పనిసరిగా మారిందని చెప్పారు. గిరిజన ప్రాంతాలకు
త్వరితగతిన 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఇప్పటికే
రాష్ట్రంలో 4జీ నెట్వర్క్ విస్తరణ కోసం జియో రూ.26 వేల కోట్లు వెచ్చించగా,
5జీ కోసం రూ.6,500 కోట్లు వ్యయం చేసిందని చెప్పారు. రాష్ట్రవ్యాప్త విస్తరణకు
అవసరమైన సహకారాన్ని ప్రభుత్వం అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. డిసెంబర్ 2023
నాటికి ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి
మూలలో జియో ట్రూ 5G సేవలు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. ప్రభుత్వ ప్రధాన
కార్యదర్శి జవహర్‌రెడ్డి మాట్లాడుతూ ఆర్థికాభివృద్ధిలో డిజిటల్ టెక్నాలజీ
కీలకపాత్ర పోషిస్తోందని చెప్పారు. దీన్ని సమర్థంగా వినియోగించుకోవటం ద్వారా
రాష్ట్రంలో పలు పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ఆరోగ్యశ్రీ, ఈ–క్రాప్ నమోదు
విషయాల్లో సాంకేతికతను వినియోగించుకుంటున్న తీరును వివరించారు. ప్రభుత్వ
పాఠశాల విద్యార్థులకు ట్యాబ్‌ల ద్వారా పాఠాలను బోధించడంతోపాటు త్వరలోనే అన్ని
క్లాసుల్లో డిజిటల్ బోర్డులను అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు.