సీనియర్ నటుడు చలపతిరావు అలియాస్ తమ్మారెడ్డి చలపతిరావు(78)కన్నుమూసిన విషయం
తెలిసిందే. శనివారం తెల్లవారుజామున ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.
పన్నెండు వందలకు పైగా సినిమాల్లో పలు రకాల పాత్రల్లో ఆయన నటించారు. కొంతకాలంగా
నటనకు దూరంగా ఉంటున్నారు. 1944మే 8న ఆయన జన్మించారు. చలపతిరావు స్వస్థలం
కృష్ణాజిల్లా పామర్రు మండలంలోని బల్లిపర్రు. నాన్న పేరు మణియ్య. అమ్మ
వియ్యమ్మది పక్కనే ఉన్న మామిళ్లపల్లి .ఆయనకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి.
ఆడపిల్లలు అమెరికాలో ఉంటారు. కుమారుడు రవిబాబు నటుడిగా, దర్శకుడిగా తెలుగు
చిత్ర పరిశ్రమలో రాణిస్తున్నారు. చలపతిరావు నటించిన మొదటి చిత్రం గూఢచారి 116,
చివరి చిత్రం ఓ మనిషీ నీవెవరు. రెండు రోజల క్రితమే సీనియర్ నటుడు కైకాల
సత్యనారాయన కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే మరో నటుడిని కోల్పోవడంతో
టాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. చలపతిరావు మృతిపై సినీ ప్రముఖులు సంతాపం
వ్యక్తం చేస్తున్నారు. చలపతిరావు ఆకస్మిక మృతి పట్ల బాలకృష్ణ విచారం వ్యక్తం
చేశారు. ఆయన తన అద్వితీయమైన ప్రదర్శనతో తెలుగు ప్రేక్షకులను రంజింపజేశారని
గుర్తు చేసుకున్నారు. చలపతిరావు మృతి జూనియర్ ఎన్టీఆర్‌ని ఎంతగానో
కలచివేసింది. ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి తన కుటుంబంతో మంచి అనుబంధాన్ని
కొనసాగించేవారని గుర్తు చేసుకున్నారు. దర్శకులు కాశీ విశ్వనాథ్, ముత్యాల
సుబ్బయ్య, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు చలపతిరావు మృతికి నివాళులర్పించారు.
తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ కూడా దివంగత చలపతిరావుకు
నివాళులర్పించారు.