తైవాన్‌కు సైనిక సహాయాన్ని పెంచే కొత్త అమెరికా రక్షణ అధీకృత చట్టంపై చైనా
శనివారం తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసినట్లు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ
తెలిపింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ డిసెంబర్ 24న 2023వ ఆర్థిక
సంవత్సరానికి సంంధించిన నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ (NDAA)పై సంతకం
చేశారు. ఇందులో పెరుగుతున్న చైనా దృఢత్వాన్ని ఎదుర్కోవడానికి, తైవాన్‌కు
మద్దతు అందించడానికి అనేక నిబంధనలు ఉన్నాయి.
“చైనా వ్యతిరేకత ఉన్నప్పటికీ, యుఎస్ 2023వ ఆర్థిక సంవత్సరానికి నేషనల్
డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్‌ను ఆమోదించి సంతకం చేసింది. ఇందులో చైనాకు
సంబంధించిన ప్రతికూల కంటెంట్ ఉంది. కాబట్టి అమెరికా చర్యను చైనా ఖండించింది..”
అని చైనా ప్రతినిధి ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖలో పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో
తెలిపారు. “ఇది చైనాకు వ్యతిరేకంగా తీవ్రమైన రాజకీయంగా రెచ్చగొట్టే
చర్య. సిపిసి నాయకత్వం చరిత్ర, ప్రజల ఎంపిక. చైనా అభివృద్ధిని అణచివేయడం,
నియంత్రించడం చైనా దేశం పునరుజ్జీవనాన్ని అడ్డుకోవడం వంటి అమెరికా
దురుద్దేశాన్ని చైనా ప్రజలు స్పష్టంగా చూస్తున్నారు. చైనా ప్రజలు, సీపీసీ
మధ్య చీలిక తెచ్చే ప్రయత్నాలు విజయవంతం కావు ” అని చైనా ప్రతినిధి తెలిపారు.