వాషింగ్టన్ : భారతీయ అమెరికన్ రిచర్డ్ వర్మ (54) అమెరికా విదేశాంగ శాఖలో
మేనేజ్మెంట్, రీసోర్సెస్ విభాగం డిప్యూటీ సెక్రటరీగా నియమితులు కానున్నారు.
అధ్యక్షుడు బైడెన్ ఈ మేరకు ప్రతిపాదించారు. ఇందుకు సెనేట్ ఆమోదం తెలిపితే
విదేశాంగ శాఖలో అత్యున్నత పదవి చేపట్టనున్న భారతీయ అమెరికన్ వర్మ అవుతారు.
ఆయన 2015–17 మధ్య భారత్‌లో అమెరికా రాయబారిగా కూడా పనిచేశారు. ఒబామా హయాంలో
విదేశాంగ శాఖ అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్నారు. ప్రస్తుతం మాస్టర్ కార్డ్
సంస్థ చీఫ్ లీగల్ ఆఫీసర్‌గా, గ్లోబల్ పబ్లిక్ పాలసీ హెడ్‌గా
పని చేస్తున్నారు.