22 మంది మృతి, ఆరుగురికి గాయాలు
మాస్కో : రష్యా సైబీరియా ప్రాంతంలో ఉన్న కెమెరోవో నగరంలో శనివారం ఓ ప్రైవేటు
భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. 22 మంది మరణించారు. మరో ఆరుగురు గాయపడినట్లు
రష్యా అధికారులు తెలిపారు. రష్యా సైబీరియా ప్రాంతంలో ఉన్న కెమెరోవో నగరంలో
శనివారం ఓ ప్రైవేటు భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. 22 మంది మరణించారు. మరో
ఆరుగురు గాయపడినట్లు రష్యా అధికారులు తెలిపారు. క్లిష్ట జీవన పరిస్థితులు
ఎదుర్కొంటున్న వారి పునరావాస కేంద్రాన్ని ఆ భవనంలో నడుపుతున్నారు. భవన
యజమానిని అరెస్టు చేశామని, అతను ఒక మతగురువుగా భావిస్తున్నామని అధికారులు
తెలిపారు. బొగ్గు ఆధారిత బాయిలర్ సరిగ్గా పని చేయకపోవడం వల్లే ఇది జరిగిందని
స్థానికులు చెబుతున్నారు.