లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. హైదరాబాద్ జూబ్ల్లీహిల్స్ లోని
మహాప్రస్థానంలో శనివారం మధ్యాహ్నం కుటుంబసభ్యులు, అభిమానుల అశ్రు నయనాల మధ్య
అంత్యక్రియలు నిర్వహించారు. కొంత కాలంగా వయో సంబంధిత సమ్యసలతో
బాధపడుతున్నసత్యనారాయణ శుక్రవారం తెల్లవారుజామున ఫిలింనగర్‌లోని తన నివాసంలో
తుది శ్వాస విడిచైనా విషయం తెలిసిందే. కృష్ణంరాజు, సూపర్ కృష్ణ మరణ వార్తలు
మరవకముందే మరో దిగ్గజ నటుడు కాలం చెందటంతో టాలీవుడ్ ఇండస్ట్రీ దుఃఖ సంద్రంలో
మునిగిపోయింది. గత ఏడాదే కైకాల ఆరోగ్యం విషమించింది. అయితే, కోలుకొని
ఇంటివద్దే చికిత్స తీసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున ఆయన
కన్ను మూశారు.
కృష్ణా జిల్లా కౌతవరం గ్రామంలో 1935 జూలై 25న కైకాల సత్యనారాయణ
జన్మించారు. సినీ అవకాశాల్ని వెతుక్కుంటూ మద్రాస్ వెళ్లిన ఆయన తొలుత ప్రసాద్
ప్రొడక్షన్స్ సంస్థలో సహాయ కళా దర్శకుడిగా కెరీర్‌ను ప్రారంభించారు .
‘కొడుకులు-కోడళ్లు’ అనే సినిమాలో కీలక పాత్ర కోసం ఎంపికైనా ఆ చిత్రం
ప్రారంభంకాలేదు. ‘సిపాయి కూతురు’ చిత్రం ద్వారా సత్యనా రాయణ సినీరంగ ప్రవేశం
జరిగింది.
యముడి పాత్రలకు ప్రాణం
తెలుగు తెరపై యముడు అనగానే తొలుత స్ఫురణకు వచ్చే రూపం సత్యనారాయణదే అంటే
అతిశయోక్తి కాదు. ఎన్నో సినిమాల్లో యముడి పాత్రలకు ప్రాణం పోశారాయన. 1977లో
ఎన్టీఆర్ హీరోగా తాతినేని రామారావు దర్శకత్వంలో వచ్చిన ‘యమగోల’ సినిమాలో
తొలిసారి యముడి పాత్రను పోషించారు. ఇందులో సత్యనారాయణ ‘యముండా..’ అంటూ చెప్పిన
డైలాగ్‌లకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. యముడికి మొగుడు, యమలీల, దరువు,
యమజాతకుడు, యమగోల మళ్లీ మొదలైంది సినిమాల్లో యముడిగా సత్యనారాయణ అసమాన నటన
కనబరిచి మెప్పించారు. యముడి పాత్రల్లో అంతకుముందు ఎన్టీఆర్, ఎస్వీఆర్ వంటి
దిగ్గజాలు నటించినప్పటికీ కైకాల సత్యనారాయణ తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు.