ఐపీఎల్ రికార్డులు తిరగరాస్తూ.. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ కొత్త
చరిత్ర సృష్టించాడు. ఈ యువ ఫాస్ట్ బౌలర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ మినీ
వేలంలో రికార్డు ధర సొంతం చేసుకున్నాడు. కొచ్చి వేదికగా శుక్రవారం జరిగిన
వేలంలో పంజాబ్ కింగ్స్ రూ.18.50 కోట్లు పెట్టి కరన్‌ను సొంతం చేసుకుంది.
గతంలో క్రిస్ మోరిస్ (16.25 కోట్లు) కోసం రాజస్థాన్ అత్యధిక ధర
చెల్లించగా.. తాజా వేలంలో ముగ్గురు ఆటగాళ్లు ఆ మార్క్‌ను దాటడం విశేషం. ముంబై,
బెంగళూరు, రాజస్థాన్, చెన్నై, లక్నో, పంజాబ్ ఒకరిని మించి ఒకరు ధర పెంచుతూ
పోవడంతో కరన్‌కు అనూహ్య రేట్ దక్కింది. 2019 సీజన్లో పంజాబ్ తరఫునే ఆడిన
కరన్.. గత సీజన్లో చెన్నైకి ప్రాతినిధ్యం వహించాడు. ఇక ఆస్ట్రేలియా నయా
సంచలనం కామెరూన్ గ్రీన్ కోసం ముంబై ఇండియన్స్ రూ.17.50 కోట్లు వెచ్చించగా..
ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్‌ను రూ.16.25 కోట్లకు చెన్నై సూపర్
కింగ్స్ కొనుగోలు చేసుకుంది. ఇప్పటి వరకు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన
కేన్ విలియమ్సన్‌ను వేలానికి వదిలేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంగ్లండ్ యువ
ఆటగాడు హ్యరీ బ్రూక్ కోసం రూ.13.25 కోట్లు వెచ్చించింది. పాకిస్థాన్‌తో
టెస్టు సిరీస్‌లో మూడు శతకాలతో అదరగొట్టిన బ్రూక్‌పై హైదరాబాద్ భారీ ఆశలు
పెట్టుకుంది. ఐపీఎల్ వేలం చరిత్రలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒక ఆటగాడి కోసం
వెచ్చించిన అత్యధిక మొత్తం ఇదే కావడం విశేషం. మయాంక్ అగర్వాల్ (రూ.8.25
కోట్లు)ను కూడా సన్‌రైజర్స్ కొనుగోలు చేసుకుంది. అనామక ఆటగాడు వివ్రాంత్
శర్మ కోసం హైదరాబాద్ రూ. 2.60 కోట్లు వెచ్చించడం గమనార్హం.