ఒమిక్రాన్ బీఎఫ్7 చైనా వెరియంట్ వేగంగా వ్యాపిస్తుందని కర్నూలు ప్రభుత్వ
ఆసుపత్రి
గుండె, ఊపిరితిత్తుల శస్త్ర చికిత్స నిపుణుడు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి
పేర్కొన్నారు. ఆయన వెల్లడించిన వివరాలు కింది విధంగా వున్నాయి.
ఒమిక్రాన్ బీఎఫ్7 ఆర్ఓ 12-18.. అంటే ఒక మనిషికి ఆ వైరస్ వస్తే 12 నుంచి 18
మంది వరకు వ్యాపిస్తుంది.
మ్యుటేషన్సు ఏవి వచ్చినా అవి బతికి వ్యాప్తి చెందాకే వైరస్ తన రూపం
మార్చుకుంటుంది. అంతే కానీ మనుషులను చంపేకి కాదు.. ఇది జలుబు లక్షాణాలు
తక్కువగా రావడం వల్ల అది వచ్చింది అని తెలిసే లోపే వేరేవాళ్ళకు వ్యాపిస్తుంది.
RTPCR టెస్ట్ చేయడం వల్ల తక్కువగా కనుగొనబడుతుంది.. ఫాల్స్ నెగటివ్ లు
ఎక్కువగా ఉన్నాయట. కాబట్టి అందరికీ టెస్టులు, ట్రేసింగ్, కంటైన్మెంటు లాంటి
పాత పద్ధతుల వల్ల పెద్ద ఉపయోగం ఉండదు..
వైరస్ మనలో ప్రవేశించినపుడు ఒమిక్రాన్ మాదిరిగానే జలుబు,దగ్గు,వళ్ళునొప్పులు,
తుమ్ములు తక్కువగా వస్తాయి. కడుపునొప్పి, వీపులో నొప్పి, విరేచనాలు రావచ్చు.
ఆయాసం వస్తే ఊపిరితిత్తులు ప్రభావితమయినప్పుడే తెలుస్తుంది,. చాలా
కొద్దిమందికే ఊపిరితిత్తులకు న్యుమోనియా వస్తుంది.. అపుడు ఆసుపతరుల్లో చేరడం
మంచిది…
ఇమ్యూనిటీ తక్కువ గా ఉండేవారు, వృద్ధులు, పిల్లలు, క్యాన్సర్ పేషంట్లు,
గుండెజబ్బులు, డయాలసిస్ పేషెంట్లు, స్టీరాయిడ్సు వాడేవారు జాగ్రత్తగా
ఉండాలి.వీరే ఆ వైరస్ కు టార్గెట్మ. మరణాల శాతం తక్కువగా ఉన్నా వీరిలో
సంభవించవచ్చు.
కాకపోతే మన దేశంలో 70శాతం మంది ఒమిక్రాన్ తో ప్రభావితమయ్యారు. 80 శాతం దాకా
రెండు డోసులు, మరికొందరు 3 డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నారు.. కాబట్టి ఆ
ఒమిక్రాన్ బీఎఫ్7 వచ్చినా తక్కువ లక్షణాలతో అలా వచ్చీవచ్చినట్లు తగిలి
పోతుంది. రిస్కు ఫాక్టర్లు ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. మళ్ళీ
వ్యాక్సిన్ బూస్టర్ వేసుకోవాలా లేదా అనేది మన దేశంలో వ్యాప్తి, వ్యాధి
ప్రోగ్రెస్ ను బట్టి ప్రభుత్వం తెలుపుతుంది.
కాకపోతే, ప్రభుత్వం కూడా జీనోమ్ సీక్వెన్సు ల్యాబులున్నాయి కాబట్టి ఏ వేరియంటు
ఎలా పోతుందో, ఏ రాష్ట్రాల్లో ఏ వేరియంటు పోతోందో, ఈ సారి మ్యాపింగ్ చేసే
అవకాశం ఉంది.. ఆ స్ప్రెడ్ ను బట్టి మన యాక్షన్ మార్చాల్సి వస్తుంది.
దీన్ని అడ్డుకోవాలంటే మాస్కు, సోషల్ డిస్టెన్స్, శానిటైజర్ వినియోగించాల్సి
వుంటుంది. అలాగే, RTPCR టెస్టులు, కాంటాక్టు ట్రేసింగు, కంటైన్ మెంటు,
లాక్డౌన్ లు అనవసరం… దీని బదులు రివర్సు ఐసోలేషన్, అంటే రిస్కు
ఫాక్టర్సున్నవాళ్ళని జాగ్రత్త పరచడం, బూస్టరు వేయడం వంటి అంశాల పై
శ్రద్ధపెడితే మరణాల సంఖ్యపై పెద్ద ప్రభావం చూపకుండా చేయవచ్చు..
మన 300 కిట్ మొదట పని చేస్తుంది. ఆయాసమొచ్చి వైరల్ న్యుమోనియా వస్తే మాత్రం
ఆసుపత్రుల్లో చేరాల్సి వస్తుంది. ప్రభుత్వం ICU బెడ్సు, వెంటిలేటరు సదుపాయం
కల్పించడం పై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం వుంది. ఆక్సిజన్, ICU
సదుపాయాలను పెంచుకోవాలి. అంతేకానీ క్యాంపుల వల్ల పెద్ద ఫలితం ఉండదు.
మీడియా కూడా రోజూ ఎన్ని కేసులు వచ్చాయి అనే దానికి ప్రాముఖ్యత ఇవ్వరాదు..
ప్రభుత్వాలు కూడా అంతే. ఫార్మాట్ చేంజ్ చేయాలి. ఎంతమంది ఆసుపత్రుల్లో
క్రిటికల్ గా చేరారు.. మరణాలెన్ని.. పర్సెంటేజ్ ఎంత అని తెలపాలి.. లేకుంటే
జనాలు పానిక్ అయిపోతారు. ఇది కూడా 90 శాతం మంది ప్రజలకు ఏమీ చేయదు. భయపడడం
అనవసరం…
గుంపులుగా తిరగకపోవడం, మాస్కు లు వాడడం ముఖ్యం. డెల్టా కంటే వేగంగా
వ్యాపించడం, తక్కువ మరణాలు సంభవించడం ఒమిక్రాన్ బీఎఫ్7 ప్రత్యేకత.