బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా స్టార్ స్పిన్నర్
రవిచంద్రన్, పేసర్ ఉమేశ్ యాదవ్ బంతితో చెలరేగిపోయారు. పదునైన బంతుల్లో బంగ్లా
బ్యాటర్లను బెంబేలెత్తించారు. ఇద్దరూ చెరో నాలుగు వికెట్లు తీసుకుని
బంగ్లాదేశ్ పతనంలో కీలక పాత్ర పోషించారు. వారి దెబ్బకు బంగ్లాదేశ్ 227
పరుగులకే కుప్పకూలింది. ఉమేశ్ యాదవ్ 15 ఓవర్లు వేసి 25 పరుగులు మాత్రమే ఇచ్చి
4 వికెట్లు పడగొట్టగా, అశ్విన్ 21.5 ఓవర్లు వేసి 71 పరుగులిచ్చి 4 వికెట్లు
తీసుకున్నాడు. ఇక ఉనద్కత్ రెండు వికెట్లు తీశాడు. 157 బంతులు ఆడిన మోమినుల్
12 ఫోర్లు, సిక్సర్‌తో 84 పరుగులు చేసి బంగ్లా జట్టులో టాప్ స్కోరర్‌గా
నిలిచాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ఆట ముగిసే సమయానికి
వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (3), శుభమన్
గిల్ (14) పరుగులతో క్రీజులో ఉన్నారు.