తెలుగు సినీ దిగ్గజం, సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ (87) శుక్రవారం
తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు
ఫిలింనగర్లోని తన నివాసంలో తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు.
దీంతో టాలీవుడ్లో తీవ్రవిషాదం నెలకొంది. కైకాల సత్యనారాయణ 1935 జులై 25న
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో జన్మించారు. విజయవాడ, గుడివాడలో
విద్యాభ్యాసం చేశారు. కైకాల సత్యనారాయణ నవరస నటసార్వభౌముడిగా పేరుగాంచారు.
కైకాలకు భార్య నాగేశ్వరమ్మ, ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 1959లో
సిపాయి కూతురు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. 60 ఏళ్ళ నటప్రస్థానంలో
777 సినిమాలకు పైనే నటించారు. ముఖ్యంగా యుముడి పాత్రతో ఆయన ప్రేక్షకుల
హృదయాల్లో నిలిచిపోయారు.