ఆఫ్రికా దేశాల్లో దగ్గుతో చిన్నారులు చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ
హెచ్చరించిన నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. తమ
బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న కంపెనీల జాబితాను నేపాల్ మెడిసిన్స్ అథారిటీ విడుదల
చేసింది. ఇందులో భారత్‌కు చెందిన 16 కంపెనీల వివరాలు కూడా వున్నాయి. ప్రముఖ
యోగా గురువు బాబా రామ్‌దేవ్‌కు చెందిన దివ్య ఫార్మసీని కూడా బ్లాక్‌లిస్ట్‌లో
చేర్చారు. దివ్య ఫార్మసీ కంపెనీ పతంజలి బ్రాండ్ పేరుతో ఉత్పత్తులను తయారు
చేస్తోంది. డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ జారీ చేసిన జాబితాలో రేడియంట్
పేరెంటరల్స్ లిమిటెడ్, మెర్క్యురీ లేబొరేటరీస్ లిమిటెడ్, అలయన్స్ బయోటెక్,
క్యాప్టాబ్ బయోటెక్, అగ్లోమెట్ లిమిటెడ్, జీ లేబొరేటరీస్ లిమిటెడ్, డాఫోడిల్స్
ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, యెల్జువల్ ఫార్మాస్ లిమిటెడ్ పేర్లు ఉన్నాయి.
అలాగే, కాన్సెప్ట్ ఫార్మాస్యూటికల్స్, ఆనంద్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్, ఐపిసిఎ
లేబొరేటరీస్ లిమిటెడ్, క్యాడిలా హెల్త్‌కేర్ లిమిటెడ్, డయల్
ఫార్మాస్యూటికల్స్, అగ్లోమెడ్ లిమిటెడ్, మాకుర్ లేబొరేటరీస్ లిమిటెడ్ వంటి
పెద్ద కంపెనీల పేర్లు కూడా జాబితాలో ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ
నిర్దేశించిన ప్రమాణాలను పాటించడంలో ఈ కంపెనీలు విఫలమయ్యాయని నేపాల్
అధికారులు పేర్కొన్నారు.