న్యూఢిల్లీ : సరిహద్దులో రెచ్చగొట్టే చర్యలకు దిగుతూ కయ్యానికి
కాలుదువ్వుతోంది చైనా. గల్వాన్ గర్షణ తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్త
పరిస్థితులు నెలకొన్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లోని భూభాగాన్ని చైనా
అక్రమించుకునే ప్రయత్నం చేస్తోందనే వాదనలూ వినిపిస్తున్నాయి. ఈ కుట్రలకు చెక్
పెట్టేందుకు భారత్ సిద్ధమైంది. భారత సైనిక దళాల అమ్ముల పొదిలో అత్యాధునికి
మిసైల్ చేరనుంది. ‘ప్రళయ్’గా పిలిచే ఈ బాలిస్టిక్ మిసైల్ 150 నుంచి 500
కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. బాలిస్టిక్ మిసైల్‌ను సైన్యంలో
చేర్చుకునే ప్రక్రియను వేగవంతం చేసింది భారత రక్షణ దళం. ఈ వారంతాంలో జరిగే
ఉన్నతస్థాయి సమావేశంలో అందుకు ఆమోదం లభించే అవకాశాలు ఉన్నాయని రక్షణ వర్గాలు
తెలిపాయి. రక్షణ శాఖలో రాకెట్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని చర్చల కొనసాగుతున్న
క్రమంలోనే ఈ క్షిపణిని తీసుకురావలన్న ప్రతిపాదన రావటం ప్రాధాన్యం
సంతరించుకుంది. ఇటీవల ఓ సమావేశంలో నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్
మాట్లాడుతూ.. సరిహద్దుల్లో శత్రువులను ధీటుగా ఎదుర్కొనేందుకు రాకెట్
ఫోర్స్‌ను ఏర్పాటు చేసేందుకు దివంగత సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ కృషి
చేసినట్లు గుర్తు చేసుకున్నారు.
ప్రళయ్ ప్రత్యేకతలు ఇవీ : మిసైల్ ప్రళయ్‌ను గత ఏడాది డిసెంబర్లో వరుసగా
రెండు రోజుల్లో విజయవంతంగా పరీక్షించారు. విజయవంతంగా లక్ష్యాలను ఛేదించిన ఈ
క్షిపణిని సైన్యంలో చేర్చుకోవాలని బలగాలు భావిస్తున్నాయి. ఈ మిసైల్ 150- 500
కిలోమీటర్ల దూరంలోని సూదూర లక్ష్యాలను సైతం ఛేదించగలదు. ప్రళయ్ సాలిడ్
ప్రొపెల్లెంట్ రాకెట్ మోటారు సహా ఇతర కొత్త సాంకేతికలతో పని చేస్తుంది.
ఉపరితలం నుంచి ఉపరితలంలోకి ప్రయోగించే పాక్షిక-బాలిస్టిక్ మిసైల్. శుత్రువుల
మిసైల్స్‌ను కూల్చేందుకు సైతం దీనిని ఉపయోగించేలా రూపొందించారు. గాల్లో కొంత
దూరం వెళ్లాక దాని మార్గాన్ని మార్చుకునే సామర్థ్యం సైతం ఈ మిసైల్‌కు ఉంది.