నోట్లను బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ విడుదల చేసింది. ప్రస్తుతం వీటి ముద్రణ
జరుగుతోంది. 2024 జూన్ నాటికి అందుబాటులోకి రానున్నాయి. అయితే చార్లెస్ ఫొటో
ఉన్న కొత్త 5, 10, 20, 50 యూరో నోట్లు క్షణాల్లోనే సామాజిక మాధ్యమాల్లో
వైరల్గా మారాయి. ఈయన ఫొటోతో ఒక నాణేన్ని కూడా విడుదల చేశారు. దాదాపు 70
ఏళ్లు బ్రిటన్ రాణిగా ఉన్న క్వీన్ ఎలిజబెత్ ఈ ఏడాది సెప్టెంబర్లో మరణించారు.
దీంతో ఆయన కుమారుడు చార్లెస్-3 కొత్త రాజు అయ్యారు. బ్రిటన్లో రాజు లేదా రాణి
ఫొటోలను కరెన్సీ నోట్లపై ముద్రిస్తారు. కొత్త నోట్లు అందుబాటులోకి వచ్చాక పాత
నోట్లు కూడా చెల్లుతాయని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ స్పష్టం చేసింది. రాణి ఫొటోలు
ఉన్న కరెన్సీ నోట్లు మొత్తం బ్యాంకులకు చేరుకునేందుకు సమయం పడుతుందని
చెప్పింది. కొత్త నోట్లపై కింగ్ చార్లెస్ ఫొటో మాత్రమే మారింది. మిగతా
డిజైన్లో ఎలాంటి మార్పులు చేయలేదు.
బ్రిటన్ రాణి ఎలిజబెత్ II మరణం తర్వాత కింగ్ ఛార్లెస్ III (74) ఆ బాధ్యతలు
చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా రాజు ఫొటోతో కూడిన కొత్త కరెన్సీ నోట్లు
అక్కడ చెలామణిలోకి రానున్నాయి. 5, 10, 20, 50 పౌండ్ల నోట్లపై కింగ్ ఛార్లెస్
చిత్రంతో వాటిని ముద్రిస్తున్నారు. నమూనా నోట్లను బ్యాంక్ ఆఫ్
ఇంగ్లాండ్విడుదల చేసింది. ఇవి 2024 నుంచి చలామణిలోకి వస్తాయని, పాత నోట్లు
కూడా చెల్లుబాటు అవుతాయని తెలిపింది. ‘కింగ్ ఛార్లెస్ III చిత్రంతో కూడిన
బ్యాంకు నోట్లను విడుదల చేయడం గర్వంగా ఉంది. నోట్లపై కనిపించే రెండో రాజు
ఈయనే. అందుకే ఇది ఎంతో అపురూపమైన క్షణం. 2024లో ఇవి చలామణిలోకి రానున్నాయి.
వీటితోపాటు రాణి చిత్రం ఉన్న నోట్లు కూడా వినియోగంలో ఉంటాయి’ అని బ్యాంక్
ఆఫ్ ఇంగ్లాండ్ గవర్నర్ ఆండ్రూ బైలీ పేర్కొన్నారు. బ్రిటన్లో గతంలో
బ్యాంకు నోట్లను పేపర్తో తయారు చేయగా కొంత కాలంగా పాలిమర్ కరెన్సీ నోట్లను
ముద్రిస్తున్నారు. ఇక కొత్తగా ప్రవేశపెట్టనున్న బ్యాంకు నోట్ల ముందు
భాగంతోపాటు సెక్యూరిటీ విండోలోనూ రాజు చిత్రం కనిపించేలా రూపొందించారు.
పర్యావరణంతోపాటు ఆర్థిక వ్యవస్థపై తాజా మార్పు ప్రభావాన్ని తగ్గించేందుకుగానూ
ప్రస్తుతం చిరిగిన నోట్ల స్థానంలోనే కొత్త వాటిని ప్రింట్ చేస్తున్నట్లు
బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ పేర్కొంది