సియోల్ : రక్షణ సామర్థ్యాలను మరింత మెరుగుపర్చుకునే దిశగా జపాన్ ఇటీవల కొత్త
భద్రతా వ్యూహాన్ని ప్రకటించడంపై ఉత్తర కొరియా మండిపడింది. స్వీయ రక్షణ కోసం
కాకుండా విదేశీ భూభాగాలపై దాడులు జరపడమే లక్ష్యంగా జపాన్ నూతన వ్యూహంతో
అత్యాధునిక ఆయుధాలను సముపార్జించుకుంటోందని ఆరోపించింది. దానికి అమెరికా అండగా
నిలుస్తూ, ప్రాంతీయ శాంతి-సుస్థిరతలకు భంగం కలిగేలా చేస్తోందని విమర్శించింది.
జపాన్ ఇదే పంథాలో కొనసాగితే ఆ దేశంపై బలమైన సైనిక చర్య చేపట్టేందుకు తాము
వెనకాడబోమని హెచ్చరించింది.

కొరియా ద్వీపకల్పానికి సమీపంలో అమెరికా యుద్ధ విమానాల జోరు
కొరియా ద్వీపకల్పం సమీపంలో మంగళవారం అమెరికా యుద్ధ విమానాలు హల్చల్ చేశాయి.
దక్షిణ కొరియాతో సంయుక్త విన్యాసాల కోసం బి-52 బాంబర్లు, ఎఫ్-22 స్టెల్త్
యుద్ధ విమానాలు సహా పలు లోహవిహంగాలను అక్కడికి అమెరికా పంపించింది. అవి గాలిలో
చక్కర్లు కొడుతూ తమ సామర్థ్యాలను ప్రదర్శించాయి. మరోవైపు- గూఢచర్య ఉపగ్రహాన్ని
ప్రయోగించగల సత్తా ఉత్తర కొరియాకు లేదంటూ వస్తున్న విశ్లేషణలను ఆ దేశ అధినేత
కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ కొట్టిపారేశారు. శునకాల మొరుగుడుతో
వాటిని పోల్చారు.