కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా 35 కామికేజ్ డ్రోన్లతో విరుచుకుపడింది. ఆదివారం
అర్ధరాత్రి నుంచి సోమవారం తెల్లవారుజామువరకు జరిగిన ఈ డ్రోన్ల దాడి రాజధాని
కీవ్ లక్ష్యంగా సాగింది. ఆ నగర మౌలిక వసతులను ధ్వంసం చేసేందుకే 20 డ్రోన్లు
రంగంలోకి దిగాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్ గ్రిడ్లను నాశనం చేశాయి. ఇందులో
15 డ్రోన్లను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ దళాలు పేర్కొన్నాయి. ఆరు రోజుల్లో
కీవ్‌పై ఇది మూడో డ్రోన్ దాడి.
బెలారస్‌కు పుతిన్ : ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో సోమవారం మరో కీలక పరిణామం
చోటు చేసుకుంది. బెలారస్ అధ్యక్షుడు లుకాషెంకోను కలిసేందుకు రష్యా అధ్యక్షుడు
పుతిన్ మిన్స్క్లో అడుగుపెట్టారు. రష్యా అధ్యక్షుడు ఆ దేశంలో పర్యటించడం
మూడున్నరేళ్ల తర్వాత ఇదే తొలిసారి. బెలారస్‌ను కూడా యుద్ధరంగంలోకి దింపేందుకు
ఒత్తిడి చేయడానికే పుతిన్ వ్యక్తిగతంగా రంగంలోకి దిగారని వార్తలు
వస్తున్నాయి. వీటిని రష్యా ఖండించింది.