సియోల్ : దక్షిణ కొరియాపై నిరంతరం నిఘా పెట్టేలా ఉత్తర కొరియా త్వరలోనే తొలి
గూఢచర్య ఉపగ్రహాన్ని తన అమ్ములపొదిలో చేర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దేశీయంగా రూపొందిస్తున్న ఓ నిఘా ఉపగ్రహానికి తాము ప్రస్తుతం తుది మెరుగులు
దిద్దుతున్నామని ఆ దేశ అధికార వర్గాలు సోమవారం వెల్లడించాయి. ఆదివారం దాన్ని
ప్రయోగాత్మకంగా పరీక్షించామని తెలిపాయి. ఆ ఉపగ్రహం తీసిన కొన్ని చిత్రాలను
కూడా విడుదల చేశాయి. దక్షిణ కొరియా రాజధాని సియోల్, ఇంచియాన్ వాటిలో
కనిపించాయి. ఆ ఫొటోలు నలుపు, తెలుపు రంగుల్లో ఉన్నాయి. వాటి రిజల్యూషన్ కూడా
తక్కువే. మరింత స్పష్టమైన చిత్రాలను అందించేలా గూఢచర్య ఉపగ్రహాన్ని ఉత్తర
కొరియా తీర్చిదిద్దుకునే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు.