కరాచీ వేదికగా పాకిస్తాన్-ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్
రసవత్తరంగా సాగుతోంది. 7/1 ఓవర్‌నైట్ స్కోర్ వద్ద రెండో రోజు ఆటను
కొనసాగించిన ఇంగ్లండ్.. హ్యారీ బ్రూక్ (150 బంతుల్లో 111; 8 ఫోర్లు, 3
సిక్సర్లు) సెంచరీతో, ఓలీ పోప్ (51), బెన్ ఫోక్స్ (64) హాఫ్ సెంచరీలతో
రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 354 పరుగులకు ఆలౌటై, కీలకమైన 50 పరుగుల ఆధిక్యం
సాధించింది. పాక్ స్పిన్నర్లు అబ్రార్ అహ్మద్, నౌమాన్ అలీ చెరో 4 వికెట్లు
పడగొట్టగా.. మహ్మద్ వసీం జూనియర్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. రెండో రోజు
ఆఖర్లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్.. ఆట ముగిసే సమయానికి
వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. పాక్.. ప్రస్తుతం ఇంగ్లండ్ తొలి
ఇన్నింగ్స్ స్కోర్ కంటే ఇంకా 29 పరుగులు వెనుకపడి ఉంది. అబ్దుల్లా షఫీక్
(14), షాన్ మసూద్ (3) క్రీజ్‌లో ఉన్నారు. మ్యాచ్‌లో ఇంకా 3 రోజులు మిగిలి
ఉండటంతో ఫలితం రావడం ఖాయమని స్పష్టమవుతుంది. తొలి రోజు పాకిస్తాన్ తొలి
ఇన్నింగ్స్‌లో 304 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే. కెప్టెన్ బాబర్ ఆజమ్
(78), అఘా సల్మాన్ (56) అర్ధసెంచరీలతో రాణించగా.. మిగతా వారంతా తక్కువ
స్కోర్లకే పరిమితమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ 4 వికెట్లు
పడగొట్టగా.. అరంగేట్రం బౌలర్ రెహాన్ అహ్మద్ 2, రూట్, మార్క్ వుడ్,
రాబిన్సన్ తలో వికెట్ దక్కించుకున్నారు. కాగా, 17 ఏళ్ల తర్వాత టెస్ట్
సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్.. బజ్ బాల్
టెక్నిక్‌ను అమలు చేసి తొలి రెండు టెస్ట్‌ల్లో విజయం సాధించింది. ఫలితం
తేలదనుకున్న తొలి టెస్ట్‌లో 74 పరుగుల తేడాతో విజయం సాధించిన స్టోక్స్ సేన..
ముల్తాన్ టెస్ట్‌లో 26 పరుగుల తేడాతో గెలుపొందింది