218 కాంతి సంవత్సరాల దూరంలో రెండు గ్రహాలు
సగం భాగం పైగా నీరు ఉన్నట్టు అంచనా
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన హబుల్ టెలిస్కోప్ రెండు కొత్త
గ్రహాలను ఆవిష్కరించింది. నీటి జాడలున్న జంట గ్రహాలను ఈ స్పేస్ టెలిస్కోప్
గుర్తించింది. ఇవి ఓ నక్షత్ర మండలంలో భాగంగా ఉన్నాయని, ఈ రెండు గ్రహాలు భూమి
పరిమాణం కంటే ఒకటిన్నర రెట్లు పెద్దవని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇవి
ఓ ఎర్రని మరుగుజ్జు నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్నాయని తెలిపారు. లిరా
నక్షత్ర మండలంలో 218 కాంతి సంవత్సరాల దూరంలో ఈ కొత్త గ్రహాలు ఉన్నట్టు
తెలిపారు. ఈ రెండు గ్రహాలు నీటితో నిండి ఉన్నాయని పేర్కొన్నారు. వీటికి
కెప్లెర్-138సి, కెప్లెర్-138డి అని నామకరణం చేశారు. ఈ రెండు గ్రహాల్లో
అత్యధిక భాగం నీరు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు.