ఛటోగ్రామ్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్ తరఫున ఆడుతున్న ఓపెనర్
శుభ్‌మన్ గిల్ తన తొలి టెస్టు సెంచరీని సాధించాడు. 3వ రోజులో భాగంగా 152
బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్ లతో 110 పరుగులు చేసి హసన్ మిర్జా బౌలింగ్ లో
అవుట్ అయ్యాడు. గిల్ కు టెస్ట్ క్రికెట్ లో ఇదే తొలి శతకం కావడం విశేషం.
కెరీర్లో 12వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న గిల్.. ఇప్పటి వరకూ 4 హాఫ్ సెంచరీలు
నమోదు చేశాడు. గత ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో 91
పరుగులు చేశాడు. బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా జరిగిన ఆ టెస్టును భారత్
గెలవడంలో ముఖ్య పాత్ర పోషించాడు. వన్డేల్లో నిలకడగా ఆడుతున్న గిల్..
టెస్టుల్లో అదే స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. రోహిత్ శర్మ గాయం కారణంగా తొలి
టెస్టుకు దూరం కావడంతో.. అతడికి ఛత్తోగ్రామ్ టెస్టులో ఆడే అవకాశం వచ్చింది. ఈ
ఛాన్స్‌ను అందిపుచ్చుకున్న గిల్.. రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో ఆకట్టుకునే
ప్రదర్శన చేశాడు.