బోస్టన్ : ఓ ఆర్థిక సంస్థ సీఈవోగా చెప్పుకొన్న హ్యాకర్ తనకు ఎఫ్బీఐ
నడుపుతున్న ఇన్ఫ్రాగార్డ్కు చెందిన కీలక సమాచారం లభించినట్లు ప్రకటించాడు.
అమెరికాలోని పలు రంగాల కీలక మౌలిక సదుపాయాల విభాగాలకు చెందిన కేంద్ర-రాష్ట్రాల
ప్రభుత్వ అధికారులు, వ్యాపారవేత్తలు, ఐటీ, రక్షణ నిపుణులతో కలిపి 1996లో
ఎఫ్బీఐ ఇన్ఫ్రాగార్డ్ అనే ప్రత్యేక సోషల్ మీడియా సైట్ను ఏర్పాటు చేసింది.
ఎంపిక చేసిన వ్యక్తులకు మాత్రమే ఈ సైట్లో సభ్యత్వం ఉంటుంది. వారి మధ్యనే దేశ
రక్షణ, ఇతర రంగాల కీలక సమాచార పంపిణీ జరుగుతుంది. ఈ బృందానికి చెందిన 80 వేల
సభ్యుల సమాచారం తన వద్ద ఉందని హ్యాకర్ వెల్లడించి, దానిని బహిర్గతం చేయకుండా
ఉండాలంటే 50 వేల డాలర్లు డిమాండ్ చేస్తున్నట్లు సైబర్ సెక్యూరిటీ జర్నలిస్టు
బ్రియాన్ క్రెబ్ బహిర్గతం చేశారు.