ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్ ఓటమితో.. బాబర్ అజామ్ నేతృత్వంలోని పాకిస్తాన్
జట్టు కొన్ని తీవ్రమైన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కోరుతోంది. ముల్తాన్లో
సోమవారం 26 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించి మూడు టెస్టుల సిరీస్లో
2-0తో ఆధిక్యంలో నిలిచింది. వరుసగా విఫలమవుతున్నమహమ్మద్ రిజ్వాన్ ను
అట్టిపెట్టడంపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు బ్యాటింగ్ కోచ్ మహమ్మద్ యూసఫ్
స్పందిస్తూ.. ‘జట్టు ఎంపిక విషయంలో ఎలాంటి పాత్ర ఉండదు’ అని సమాధానం ఇచ్చాడు.
దీనిపై పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది అసహనం వ్యక్తం చేశాడు. “యూసఫ్ నుంచి
ఇలాంటి స్పందన వస్తుందని ఆశించలేదు. యూసఫ్ బ్యాటింగ్ కోచే కదా..? ఆటగాళ్లు
సరైన ప్రదర్శన ఇవ్వకపోతే అడగాల్సిన బాధ్యత అతడిపై ఉంది. బ్యాటింగ్ కోచ్గా అది
అతడి విధి. నేను ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. రిజ్వాన్ కు కాస్త విరామం
అవసరం ఉంది. అతడి స్థానంలో సర్ఫరాజ్ అహ్మద్ ను కానీ, మసూద్ ను కానీ
తీసుకోవాలి” అని అఫ్రిది పేర్కొన్నాడు.