సెలెబ్రిటీలను మోసం చేస్తూ బెదిరిస్తూ దాదాపు రెండు వందల కోట్లు లాగేసిన
సుఖేష్ చంద్రశేఖర్ కేసులో బాలీవుడ్ భామలు జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నోరా
ఫతేహిల పేర్లు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ మనీ లాండరింగ్ కేసులో తన
పేరును కావాలనే లాగుతోందని జాక్వెలిన్ మీద నోరా ఫతేహి పరువునష్టం దావా
వేసింది. రెండు వందల కోట్ల మనీ లాండరింగ్ కేసులో తన పేరుని కావాలనే
లాగుతోందని, తన పరువుతీస్తోందంటూ నోరా వాపోయింది. తనకు, సుఖేష్‌కు ఎప్పుడూ
డైరెక్ట్ కాంటాక్ట్ కూడా లేదని నోరా వెల్లడించింది. తాను ఓ సారి సుఖేష్ భార్య
లీనా ఆహ్వానం మేరకు వెళ్లానని చెప్పుకొచ్చింది. ఆమె తనకు బహుమతులు ఇచ్చిందని
నోరా తెలిపింది. అయితే ఈ విషయం మీదే నోరాను ఈడీ అధికారులు విచారించారని
తెలుస్తోంది. కొత్త ఐఫోన్, ఖరీదైన బ్యాగులు, బీఎండబ్ల్యూ కారును బహుమతులుగా
ఇచ్చారట. దీనిపై నోరాను ఈడీ ప్రశ్నలు అడిగి వివరాలు తెలుసుకున్న విషయం విదితమే.