స్టార్ ఆటగాడు రొనాల్డో కల కలగానే మిగిలిపోయింది. 56ఏళ్ల నిరీక్షణకు
తెరదించాలని ఖతార్ గడ్డపై అడుగు పెట్టిన పోర్చుగల్ జట్టుకు మరోసారి నిరాశే
ఎదురైంది. శనివారం జరిగిన ఫిఫా ప్రపంచ క్వార్టర్ ఫైనల్లో ఆఫ్రికా జట్టు మొరాకో
చేతిలో పోర్చుగల్ ఓటమి పాలైంది. ఫలితంగా ఆ జట్టు స్టార్ ఆటగాడు రొనాల్డో తన
ఆఖరి ప్రపంచకప్లోనైనా జట్టుకు ట్రోఫీని అందించాలన్న కల నెరవేరక పోవటంతో
మైదానంలోనే వెక్కివెక్కి ఏడ్చాడు. డ్రసింగ్ రూంకు వెళ్లేంత వరకు రొనాల్డో
కన్నీరు పెడుతూనే కనిపించాడు. శనివారం మొరాకో – పోర్చుగల్ జట్ల మధ్య
హోరాహోరీగా సాగిన మ్యాచ్ లో మొరాకో జట్టు 1-0 తేడాతో విజయం సాధించింది. దీంతో
హాట్ ఫేవరెట్ జట్టు పోర్చుగల్ ఇంటిదారి పట్టాల్సి వచ్చింది. ఇదిలాఉంటే..
క్రిస్టియానో రొనాల్డోను టీం మేనేజ్మెంట్ ఈ మ్యాచ్ లోనూ ఆరంభంలో ఆడించలేదు.
37ఏళ్ల రొనాల్డోను 51వ నిమిషంలో సబ్ స్టిట్యూట్ ప్లేయర్ గా బరిలోకి దించారు.