ప్యారిస్: ఫ్రాన్స్‌లో 25 ఏళ్లలోపు వయసున్న ఎవరైనా జనవరి ఒకటో తేదీ నుంచి ఔషధ
దుకాణాల్లో ఉచితంగా కండోమ్‌లు పొందొచ్చని ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్
మేక్రాన్ ప్రకటించారు. యువతలో పెరిగిపోతున్న లైంగిక అంటురోగాలకు అడ్డుకట్ట
వేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. ఫ్రాన్స్‌లో
ఇప్పటికే 25 ఏళ్లలోపు బాలికలు, యువతులు ఉచితంగా కండోమ్‌లు పొందుతున్నారు.
అవాంఛిత గర్భధారణలను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఈ సదుపాయం కల్పించింది.
వాస్తవానికి గురువారం మేక్రాన్ మాట్లాడుతూ.. జనవరి ఒకటో తేదీ నుంచి 18-25
ఏళ్లలోపు వారు ఔషధ దుకాణాల్లో ఉచితంగా కండోమ్‌లు పొందొచ్చని ప్రకటించారు.
అనంతరం ఫ్రెంచ్ టీవీ ప్రెజెంటర్ ఒకరు, మరికొందరు వ్యక్తులు సామాజిక మీడియాలో
అధ్యక్షుడి నిర్ణయాన్ని ప్రశ్నించారు. మైనర్లను ఎందుకు చేర్చలేదని నిలదీశారు.
దీంతో ఈ కార్యక్రమాన్ని వారికీ విస్తరిస్తున్నట్లు అధ్యక్షుడు ప్రకటించారు. ఈ
మేరకు ప్రస్తుతం స్పెయిన్‌లో ఉన్న ఆయన ఓ సెల్ఫీ వీడియోను పోస్ట్ చేశారు.
‘అలాగే చేద్దాం’ అని అందులో పేర్కొన్నారు. ‘‘చాలా మంది మైనర్లు కూడా శృంగారంలో
పాల్గొంటున్నారు. తమనుతాము రక్షించుకోవడం వారికీ అవసరం’’ అని
ట్విటర్లో వెల్లడించారు.