ఆల్మండ్ ఆయిల్ పోషకాల పవర్‌హౌస్. చేదు బాదం నూనెను సువాసనకు ఉపయోగిస్తుండగా,
తీపి బాదం నూనె సాధారణంగా చర్మం, జుట్టుపై కూడా వినియోగించవచ్చు. బాదం నూనెలో
విటమిన్ E, A, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మంలో కొల్లాజెన్
ఉత్పత్తిని కొనసాగిస్తుంది. అలాగే చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది.
ఇక ముఖానికి ఆయిల్ మసాజ్ ఎల్లప్పుడూ సహకరిస్తుంది. అందం, అంతకు మించి చాలా
ప్రయోజనాలను కలిగి ఉంటుంది. బాదం నూనె పురాతన చైనీస్ ఔషధం. అది ముఖానికి
ఉపశమనం కలిగించే ఆయుర్వేద మార్గం. ఆది సాంప్రదాయకంగా కోతలు లేదా గాయాలను నయం
చేయడానికి ఉపయోగించబడింది, కానీ ఇప్పుడు చాలా బ్యూటీ కంపెనీలు ముఖ ఉత్పత్తుల
కోసం బాదం నూనెను ఉపయోగిస్తున్నాయి. ఆల్మండ్ ఆయిల్ దాని స్వచ్ఛమైన రూపంలో
విటమిన్ ఎ, విటమిన్ ఇ, జింక్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లను కలిగి ఉంటుంది.
దీన్ని ఫేషియల్ ప్రొడక్ట్‌గా ఉపయోగించడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. టాన్
రివర్సల్, డ్యామేజ్ రివర్సల్, మొటిమల నివారణ, మచ్చలు తగ్గడం కోసం
మాయిశ్చరైజేషన్ చేసుకోవచ్చు. చర్మం కాంతివంతంగా మెరవాలంటే.. బాదం నూనెలో
కొంచెం బియ్యంపిండి, రోజ్ వాటర్ మిక్స్ చేసి ముఖానికి రాసుకోవాలి. 10 నిమిషాల
తర్వాత మసాజ్ చేసి, ఆపై గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడగాలి. ఈ ప్రక్రియ
తర్వాత మాయిశ్చరైజ్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మం
కాంతివంతంగా మెరుస్తుంది.