భారత్ స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను మరోసారి అద్భుత ప్రదర్శనతో
ఆకట్టుకుంది. మణికట్టు గాయంతో బాధపడుతున్నా.. నొప్పిని పంటిబిగువున భరిస్తూనే
ప్రపంచ వేదికపై బరిలోకి దిగి పతకంతో సత్తాచాటింది. టోక్యో ఒలింపిక్స్ రజత పతక
విజేత అయిన మీరా.. తాజాగా ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ లో రజతం
గెలిచింది. మహిళల 49 కిలోల విభాగంలో పోటీపడ్డ మీరా.. స్నాచ్‌లో 87 కిలోలు,
క్లీన్ అండ్ జెర్క్‌లో 113 కిలోలు ఎత్తి ఓవరాల్‌గా 200 కిలోలతో
రెండోస్థానంలో నిలిచింది. రజత పతకం సాధించే క్రమంలో మీరా.. టోక్యో ఒలింపిక్
చాంపియన్, చైనా లిఫ్టర్ హో జిహువాను ఓడించడం విశేషం. జిహువా 198 కిలోల
(స్నాచ్‌లో 89 కి.+109 కి)తో మూడోస్థానంలో నిలిచి కాంస్య పతకానికి
పరిమితమైంది. చైనాకే చెందిన జియాంగ్ హుహువా మొత్తం 206 కిలోలు (93 కి.+113
కి) ఎత్తి ప్రథమస్థానంతో స్వర్ణ పతకాన్ని ఎగరేసుకుపోయింది. మణిపూర్‌కు చెందిన
28 ఏళ్ల మీరాబాయికిది రెండో ప్రపంచ పతకం. అంతకుముందు 2017లో ఈ మెగా టోర్నీలో
స్వర్ణం సాధించింది. ఈ ఏడాది సెప్టెంబరులో ట్రైనింగ్ సెషన్ సందర్భంగా మీరా
మణికట్టుకు గాయమైంది. అయినా కూడా మరుసటి నెలలో జరిగిన జాతీయ క్రీడల్లో
గాయంతోనే పోటీపడి పసిడి పతకం నెగ్గింది. ‘నొప్పి ఇంకా అలాగే ఉన్నప్పటికీ..
మెగా ఈవెంట్‌కు దూరం కారాదని నిర్ణయించుకున్నా. ఎలాంటి పరిస్థితుల్లోనైనా
దేశానికి ప్రాతినిథ్యం వహించడమే ముఖ్యమనుకున్నా. అందుకే బరిలోకి దిగా. పతకం
సాధించా. రెండోసారి ప్రపంచ చాంపియన్‌షిప్ లో పతకం అందుకోవడం సంతోషంగా ఉంది.
వచ్చే ఆసియా క్రీడలతో పాటు పారిస్ ఒలింపిక్స్‌లోనూ స్వర్ణం సాధిస్తానన్న
విశ్వాసం ఉంది’ అని మీరా తెలిపింది.