ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. ప్రతిపక్ష పార్టీలు దూకుడు
పెంచినట్టు కనిపిస్తుండగా.. అధికార పార్టీ సైతం స్పీడ్ పెంచింది. నిన్న జయహో
బీసీ కార్యక్రమం నిర్వహించడంతో పాటు.. ఇవాళ పార్టీ ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి
జగన్మోహన్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ పరిశీలకులతో క్యాంపు
కార్యాలయంలో గురువారం ఆయన ఈ సమావేశం నిర్వహించారు. తాడేపల్లి సీఎం క్యాంపు
కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు మీటింగ్ జరిగింది. 175 నియోజకవర్గాల
ప్రతినిధులతో ఆయన సమావేశం కావడం విశేషం. ఇటీవలే అన్ని నియోజకవర్గాల పరిశీలకుల
నియామకాలు జరిగాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యేల పనితీరు, కింది స్థాయి కార్యకర్తల
అభిప్రాయాలను అబ్జర్వర్ల ద్వారా తెలుసుకుని సీఎం జగన్ దిశా నిర్దేశం
చేయనున్నారు. అనంతరం క్షేత్ర స్థాయి స్థితిగతులపై అధ్యయనం చేయనున్నారు.
ఇప్పటికే ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. ప్రధాన పార్టీలన్నీ వచ్చే ఎన్నికలే
లక్ష్యంగా తమ ప్రచారం మొదలు పెట్టేశాయి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమంటూ..
దాదాపు అందరూ ప్రకటించేశారు. మొన్న.. ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు ముందస్తు
ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేయడంతో పాటు మనం ఇప్పుడు ఎన్నికల ప్రచారంలోనే
ఉన్నామన్న విషయం తెలిసిందే. సరిగ్గా ఇదే సమయంలో నిన్న జరిగిన జయహో బీసీ సభలో
ఏపీ సీఎం జగన్ సైతం ఎన్నికల యుద్ధం మొదలైందని ప్రకటించారు.
కాగా, ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమేనంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు సైతం
స్పష్టం చేశారు. ఇదేం కర్మ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. వచ్చే
జనవరి 27 నుంచి నారా లోకేష్ సైతం పాదయాత్రకు సిద్ధపడుతున్నారు. ఇక జనసేన
పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. ఎన్నికల సమరానికి వారాహి రెడీ అంటూ.. తన బస్సు
యాత్రకు సంబంధించిన ట్వీట్ తో మరింత హీట్ పెంచారు.

ఈ క్రమంలోనే అధికార వైసీపీ మరింత జోష్ పెంచుతోంది. ఇందులో భాగంగానే జిల్లా
అధ్యక్షులు, అబ్జర్వర్ల తో ముఖ్యమంత్రి జగన్ సమావేశం నిర్వహించడం విశేషం.
ఇప్పటికే వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా పలు సభలు నిర్వహిస్తోంది. నిన్న జయహో బీసీ
సభ నిర్వహించినట్టుగానే.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సంబంధించి కూడా ఇలాంటి
సమావేశాలను నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.