రష్యా వైమానిక స్థావరాలపై జరిగిన దాడులతో తమకు సంబంధం లేదని అమెరికా
విదేశాంగశాఖ మంత్రి పేర్కొన్నారు. తాము ఉక్రెయిన్ ఆ దిశగా ప్రోత్సహించలేదని
చెప్పారు. రష్యా వ్యూహాత్మక బాంబర్లను నిలిపిన కుర్స్క్ ప్రాంతం సహా మూడు
వైమానిక స్థావరాలపై దాడులు చేసేలా ఉక్రెయిన్ కు తాము సహకరించలేదని అమెరికా
వెల్లడించింది. ఆ దేశ విదేశీ వ్యవహారాలశాఖా మంత్రి ఆంటోనీ బ్లింకన్ ) ఈ
విషయాన్ని వివరించారు. తమ వైమానిక స్థావరాలపై డ్రోన్ దాడి కీవ్ పనే అని రష్యా
ఆరోపించిన కొద్దిసేపటికే వెంటనే అమెరికా ప్రతిస్పందన రావడం గమనార్హం. తాము ఈ
దాడులకు సాయంగానీ, ప్రోత్సాహంగానీ అందించలేదని బ్లింకన్ పేర్కొన్నారు. అదే
సమయంలో ఉక్రెయిన్‌లో రష్యా దాడులను ఆయన తప్పుపట్టారు. ప్రజలకు అవసరమైన ఉష్ణం,
నీరు, విద్యుత్తు అందించే వ్యవస్థలపై రష్యా దాడులు చేస్తోందని ఆరోపించారు.
శీతాకాలాన్ని మాస్కో ఆయుధం వలే ఉపయోగిస్తోందని ఆరోపించారు. ‘‘రష్యా భూభాగాల్లో
ఉక్రెయిన్ దాడులను మేము ప్రోత్సహించడం లేదా సహకరించడం గానీ చేయడంలేదు.
ఉక్రెయిన్ పై వరుస దాడులతో అక్కడి ప్రజలు జీవితం ఎలా ఉంటోందో అర్థం
చేసుకోవాలి. ఆత్మరక్షణకు, భూభాగాన్ని కాపాడుకోవడానికి, వారి స్వేచ్ఛను
రక్షించుకోవడానికి అవసరమైన ఆయుధ సంపత్తి ఉక్రెయిన్ వాసుల వద్ద ఉంది’’ అని
బ్లింకన్ వెల్లడించారు.
అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ మాట్లాడుతూ ఉక్రెయిన్ దీర్ఘశ్రేణి
ఆయుధాలను అభివృద్ధి చేసుకొంటే తమ దేశం అడ్డుకోదని పేర్కొన్నారు. ‘‘ఒక్క
ముక్కలో చెప్పాలంటే మాకు సంబంధంలేదు. మేమైతే కచ్చితంగా చేయలేదని ఆస్టిన్
పేర్కొన్నారు. ఇప్పటికే వాషింగ్టన్ నుంచి ఉక్రెయిన్‌కు దాదాపు 19 బిలియన్
డాలర్ల విలువైన సైనిక సాయం అందింది. అమెరికా అండర్‌సెక్రటరీ (పొలిటక్
అఫైర్స్) విక్టోరీయా నూలాండ్స్ మాట్లాడుతూ ‘‘ డ్రోన్ దాడులకు ఎవరూ బాధ్యత
స్వీకరించడంలేదు. కానీ, ఉక్రెయిన్ ప్రజలు అత్యంత సృజనాత్మకత ఉన్నవారు.
సొంతంగా గగనతల, సముద్ర డ్రోన్లు తయారు చేసుకొంటున్నారు. అది చాలా ప్రభావ
వంతంగా ఉందని పేర్కొన్నారు. నిన్న రష్యా లోని మొత్తం మూడు వైమానిక స్థావరాలపై
దాడులు జరిగాయి. వీటిల్లో రెండు ఉక్రెయిన్ సరిహద్దులకు
వందలమైళ్ల దూరంలో ఉన్నాయి.