బ్రిటన్‌లోని అతిపెద్ద మీడియా పబ్లిషర్ అసోసియేటెడ్ న్యూస్‌పేపర్స్ పై
ప్రిన్స్ హ్యారీ వేసిన పరువునష్టం దావా కేసుకు తాత్కాలిక విరామం లభించింది. ఈ
కేసు పై మంగళవారం లండన్ హైకోర్టు లో విచారణ జరిగింది. దావాను తాత్కాలికంగా
నిలిపివేయడానికి ఇరుపక్షాల న్యాయవాదులు అంగీకరించారు. డ్యూక్ ఆఫ్ సస్సెక్స్
మెయిల్ పబ్లిషర్ ఆన్ సండే వార్తాపత్రికలో ఫిబ్రవరిలో వచ్చిన కథనానికి
సంబంధించి పబ్లిషర్‌పై ప్రిన్స్ హ్యారీ దావా వేశారు. అతను తన పోలీసు రక్షణను
పునరుద్ధరించడానికి బ్రిటన్ అంతర్గత మంత్రిత్వ శాఖతో తన న్యాయ పోరాట వివరాలను
రహస్యంగా ఉంచడానికి ప్రయత్నించాడనేది ఆ కధనం సారాంశం. దీనిపై ప్రిన్స్ హ్యారీ
పరువునష్టం దావా వేశారు. మంగళవారం లండన్ హైకోర్టు లో విచారణ సందర్భంగా
ఇరుపక్షాల న్యాయవాదులు ఒక అవగాహనకు రావడం విశేషం.