భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య బుధవారం రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. ఢాకాలో
ఉదయం 11:30 గంటల నుంచి మ్యాచ్ జరగనుంది. మొదటి మ్యాచ్ లో ఓడిపోయిన టీమిండియా
నేటి మ్యాచ్ లో గెలవాలనే పట్టుదలతో ఉంది. ఇదిలా ఉండగా, ప్రస్తుతం భారత్
విజయాల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి పాత్ర ఎంతో ఉంది. వ్యక్తిగతంగా
అదరగొడుతూనే కలిసి కట్టుగా జట్టుకు అద్భుత విజయాలను అందిస్తున్నారు. ప్రస్తుతం
కోహ్లీ సూపర్ ఫామ్ లో ఉంటే రోహిత్ పరుగుల కోసం ఇబ్బంది పడుతున్నాడు. అయితే
రోహిత్ కూడా ఫామ్ ను అందుకుంటాడని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం భారత్.. బంగ్లాదేశ్ పర్యటనలో ఉండగా మొదటి మ్యాచ్లో ఓటమిపాలైన విషయం
తెలిసిందే. అయితే ఒక అరుదైన రికార్డుకు వీరు దగ్గరయ్యారు. ఇది వ్యక్తిగతంగా
కాకుడా కలిసి సాధించే రికార్డుగా ఉండటం విశేషం. అంతర్జాతీయ వన్డేల్లో 5 వేల
పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేయడానికి రోహిత్, కోహ్లీ జోడీ కేవలం 61
పరుగుల దూరంలో ఉంది.