తృణమాల్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ప్రతినిధి సాకేత్ గోఖలేని గుజరాత్
పోలీసులు అరెస్టు చేయడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం
వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ.. ‘ప్రధానికి వ్యతిరేకంగా ట్వీట్ చేసిన
వారిని అరెస్టు చేస్తారు. మరి నాకు వ్యతిరేకంగా చాలా మంది ట్వీట్లు చేశారు
కదా? వారి మాటేమిటి? ఎంతైనా ఇది ఖండించదగిన ఘటన’ అన్నారు. టీఎంసీ నేతను
అరెస్టు చేయడం విచారకరమన్నారు. సాకేత్ కేవలం ఒక వార్తను ఉటంకించి.. ప్రధానికి
వ్యతిరేకంగా ట్వీట్ చేసిన కారణంగానే గుజరాత్ పోలీసులు అతన్ని అరెస్టు
చేశారన్నారు. అలాగే తనకు వ్యతిరేకంగా చాలా మంది ట్వీట్లు చేస్తున్నారని, ఇక
నుంచి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఆ ట్వీట్లు, వ్యక్తిగత దాడులన్నింటినీ
తప్పనిసరిగా పరిశీలించాలని దీదీ డిమాండ్ చేశారు. మోర్బి వంతెన కూలిపోవడం చాలా
పెద్ద దుర్ఘటన అని, అందుకే తమ పార్టీ నేత ఆ విషయాన్ని ఉటంకించారన్నారు. ఇది
ప్రభుత్వ ప్రతీకార వైఖరి అని టీఎంసీ అధినేత్రి పేర్కొన్నారు.