గుజరాత్ : ఈసారి గుజరాత్లో రికార్డు స్థాయిలో ఓట్లు, సీట్లతో సాధించాలని,
హిమాచల్‌లో అధికార మార్పిడి ట్రెండ్‌కు ముగింపు పలకాలన్న పట్టుదలతో ప్రధాని
నరేంద్ర మోడీ, అమిత్ షాతో పాటు ఆ పార్టీ అగ్రనేతలంతా ఎన్నికల ప్రచారంలో
దూసుకుపోయారు. మరోవైపు, తమ పూర్వ వైభవాన్ని చాటుకోవాలని కాంగ్రెస్ పార్టీ
తరపున ప్రియాంకా గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, జైరాం రమేశ్ వంటి కొందరు సీనియర్
నేతలు ప్రచారం పర్వంలో చెమటోడ్చారు. భారత్ జోడో యాత్రలో పాల్గొన్నందున
రాహుల్ గాంధీ ఈ ఎన్నికల ప్రచారానికి (గుజరాత్లో ఒకట్రెండు సభల్లో తప్ప)
దూరంగానే ఉన్నారు. ఇకపోతే, ఆప్ కూడా ఈ ఎన్నికల్లో చురుగ్గా పనిచేసింది. ఈ
నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్, ఆప్‌ల మధ్య హోరాహోరీగా కొనసాగిన ఈ ఉత్కంఠ
పోరులో గెలుపెవరదనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. హిమాచల్‌ప్రదేశ్‌లో
మొత్తం 68 స్థానాలకు నవంబర్ 12న ఒకే దశలో పూర్తి కాగా 66.58శాతం పోలింగ్
నమోదైంది. అలాగే, గుజరాత్లో మొత్తం 182 సీట్లకు గాను రెండు దశల్లో పోలింగ్
నిర్వహించారు. డిసెంబర్ 1న 89 స్థానాలకు తొలి విడత ఎన్నికల్లో 63.31శాతం
పోలింగ్ నమోదవ్వగా.. డిసెంబర్ 5న 93 సీట్లకు రెండో దశలో సాయంత్రం 5గంటల వరకు
58 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. సర్వేల అంచానా ఎలా ఉన్నప్పటికీ అసలు
లెక్కలు తేలాలంటే డిసెంబర్ 8న వెల్లడయ్యే ఫలితాలు వరకూ వేచి చూడాల్సిందే.