న్యూఢిల్లీ : వచ్చే ఏడాది భారత్లో జరగనున్న జి-20 దేశాధినేతల ప్రతిష్టాత్మక
సదస్సుకు భారత్ వేదిక కావడం పట్ల సీఎం వైయస్.జగన్ మోహన్ రెడ్డి సంతోషం
వ్యక్తంచేశారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ కి ఆయన అభినందనలు తెలియజేశారు.
జి-20 సదస్సు సన్నాహకాలు, వ్యూహాల ఖరారులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ
అధ్యక్షతన న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లోని అశోకాహాలులో సోమవారం సమావేశం
నిర్వహించారు. సీఎం వైయస్.జగన్ మోహన్ రెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ
సందర్భంగా సమావేశంలో సీఎం మాట్లాడారు. జి-20 దేశాల సదస్సు కోసం చేసే
ఏర్పాట్లు, దానికోసం జరిగే సన్నాహకాల్లో ఎలాంటి బాధ్యతను ఆంధ్రప్రదేశ్
రాష్ట్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించినా నెరవేర్చడానికి సిద్ధంగా
ఉన్నామని సీఎం అన్నారు. ఈ ప్రతిష్టాత్మక సదస్సు విజయవంతం కావడానికి అన్నిరకాలు
తాము సహాయ సహకారాలు అందిస్తామన్నారు. జి-20 అధ్యక్ష పదవిని భారత్ చేపట్టిన ఈ
సందర్భంలో రాజకీయ కోణంలో వ్యాఖ్యలు చేయడం సరికాదని, అంతర్జాతీయ సమాజం దేశంవైపు
చూస్తున్న ఈ సందర్భంలో అందరూ ఒక్కతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని సీఎం
చెప్పారు. రాజకీయపార్టీల మధ్య విభేదాలు సహజమని, కాని వాటిని మనవరకే పరిమితం
చేసుకుని జి-౨౦ సదస్సు విజయవంతం చేయడానికి అందరూకలిసికట్టుగా
ముందుకుసాగాలన్నారు. సమావేశం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి విజయవాడ బయల్దేరారు.